Thursday, May 2, 2024

హిందీలో కూడా ‘ఆచార్య‌’

ఏప్రిల్ 29న ఆచార్య చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ముందు తెలుగులో మాత్ర‌మే రిలీజ్ చేయాల‌నుకున్నారు చిత్ర యూనిట్. కానీ హిందీ వెర్ష‌న్ లోను భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్నారు. కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. చిరూ సరసన కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఆయన నుంచి వదిలిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోనూ సూద్ .. సంగీత .. పోసాని .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, రెజీనా ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement