Friday, May 17, 2024

కేసీఆర్‌ ఎత్తు బంగారం.. సమ్మక్క జాతరలో పంపిణీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు పెద్దపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. గురువారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని సమ్మక్క జాతరలో కేసీఆర్‌ ఎత్తు బంగారం తులాభారం వేయించి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి భక్తులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు దశాబ్ధాల కలను నెరవేర్చిన మహనీయుడు కేసీఆర్‌ అని, సమ్మక్క సారలమ్మలు సీఎంకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకున్నామన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర సాధన కేసీఆర్‌ వల్లే సాధ్యమైందన్నారు. 14 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం నిర్వహించి తెలంగాణను సాధించిన కేసీఆర్‌ బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, దళితబంధులాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement