Thursday, May 2, 2024

‘ఆచార్య’ రిలీజ్ డేట్ ఫిక్స్ – ఎప్పుడంటే

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టిస్తున్న ఆచార్య చిత్రం రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేస్తూ ఓ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని ఉగాది ప‌ర్వ‌దినాన రిలీజ్ చేయ‌నున్నారు. కాగా ఏప్రిల్ 1న ఆచార్య చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆ చిత్రంలో చిరంజీవి త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నాడు. చిరంజీవి స‌ర‌స‌న‌ కాజల్ అగర్వాల్, చరణ్ స‌ర‌స‌న‌ పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుద‌లైన ప‌లు పాట‌లకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుద‌ల చేయాల‌ని ముందుగా నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ దేశంలో కరోనా విజృంభ‌ణ కార‌ణంగా ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement