Friday, May 3, 2024

ఐపీఎల్ కి హోస్ట్ గా అమీర్ ఖాన్ -మ్యాచ్ బ్రేక్ లో లాల్ సింగ్ చ‌ద్దా ట్రైల‌ర్ రిలీజ్

ఐపీఎల్ లో మెర‌వ‌నున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. ఐపీఎల్ ఫైన‌ల్ కి హోస్ట్ గా చేయ‌నున్నారు. కాగా మే 29 న టెలివిజన్‌లో 2.30 నిమిషాల మొదటి ఇన్నింగ్స్ .. రెండవ వ్యూహాత్మక సమయ వ్యవధిలో అతని రాబోయే చిత్రం ‘లాల్ సింగ్ చద్దా ట్రైలర్‌ను ఆవిష్కరిస్తారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ, చిత్ర నిర్మాతలు తమ సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను పంచుకున్నారు, ఇందులో అమీర్ ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 6.00 గంటల నుండి అమీర్ ఖాన్ హోస్ట్ చేస్తారు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ .. డిస్నీ హాట్‌స్టార్‌లో ప్ర‌సారం కానుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిరణ్ రావు .. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన ‘లాల్ సింగ్ చద్దా’లో కరీనా కపూర్ ఖాన్, మోనా సింగ్ ..నాగ‌ చైతన్య అక్కినేని కూడా నటించారు. 1994లో విడుదలైన టామ్ హాంక్స్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కి భారతీయ రీమేక్ ఈ చిత్రం.. ఆగస్ట్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐపీఎల్ మ్యాచ్ బ్రేక్ లో లాల్ సింగ్ చ‌ద్దా ట్రైల‌ర్ ని రిలీజ్ చేయ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement