Sunday, April 28, 2024

తెలుగు ఫ్యాన్స్ కు పక్కా ట్రీట్.. త‌న సోంత వాయితో ఈటి తెలుగు వెర్షన్ డ‌బ్బింగ్..

సూర్య‌ న‌టించిన సినిమాలు తెలుగులోనూ మంచి కలెక్ష‌ను సాధిస్తుంటాయి. ఈయ‌న న‌టించిన గ‌త రెండు సినిమాలు ఓటీటీలో విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. అయితే హీరో సూర్య ఇప్పుడు న‌టిస్తున్న తాజా చిత్రం ఈటి (ఎతర్క్కుమ్ తునింధవన్). యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్లో 5 భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తిన్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం సమకూర్చగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మూవీలో సూర్య, ప్రియాంక మోహన్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా, మార్చ్ 4న ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే చిత్రం బృందం విడుద‌ల చేసిన ప్ర‌చార చిత్రాలు, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జరుపుకుంటుంది. ఈ క్రమంలో సూర్య త‌న సోంత డ‌బ్బింగ్ చెబుతున్న ఫోటోను ట్వీట్ చేసింది సినీ బృందం.. సూర్య ఇంత‌క‌ముందు కూడా త‌న సోంత వాయిస్ తో గ్యాంగ్ సినిమాలో డ‌బ్బింగ్ చెప్ప‌డం జ‌రిగింది. అయితే ఇప్పుడు సన్ పిక్చర్స్ పోస్ట్ చేసిన పోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement