Sunday, May 5, 2024

యుద్ద వాతావ‌ర‌ణంలో ఒక్క‌టైన ప్రేమ‌జంట‌

గ‌త ప‌ది రోజుల‌కు పైగా ఉక్రెయిన్ పై ర‌ష్యా బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అయితే ఎంత యుద్ధం జ‌రిగినా ప‌ర్లేదు.. మ‌న పెళ్లి మాత్రం జ‌ర‌గాల్సిందే అనుకున్నారు ఈ ప్రేమ‌జంట‌. పెళ్లి పీట‌లెక్కారు. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్​కు, రష్యాకు మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇతంటి భయానక వాతావరణంలోనూ ఓ ఆసక్తికరమైన సంఘటన ఉక్రెయిన్​ సైన్యంలో జరిగింది. రష్యా భీకర కాల్పుల మధ్య ఉక్రెయిన్ యుద్ధభూమిలో.. పెళ్లి భాజాలు మోగాయి. కీవ్‌లో రష్యా సేనలతో పోరాడుతున్న 112 బ్రిగేడ్‌కు చెందిన ఉక్రెయిన్‌ సైనికులు లెసియా, వాలెరీ రణ క్షేత్రంలోనే.. వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరు.. కాల్పుల మోత మధ్యే సంప్రదాయబద్ధంగా ఒక్కటయ్యారు. వీరి వివాహం జరుగుతుండగా రష్యా సైనికులు విన్నిట్సియా విమానాశ్రయాన్ని ధ్వంసం చేశారు. అయితే ఈరోజు ర‌ష్యా నాలుగు న‌గ‌రాల‌పై తాత్కాలిక కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement