Thursday, May 16, 2024

పూణే లో భారీ అగ్నిప్రమాదం

ఈరోజు తెల్లవారుజామున మహారాష్ట్రలోని పుణేలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పుణేలోని ఔంధ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ రూఫ్ టాప్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య సముదాయం పదో అంతస్తులో ట్రూ ట్రాంప్ ట్రంప్ అనే రెస్టారెంట్ ఉన్నది. రెస్టారెంట్ లోపలి భాగంలో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి రెస్టారెంట్‌ మొత్తం వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement