Wednesday, May 1, 2024

Earthquake : ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం… తీవ్ర‌త 6.5

ఫిలిప్పీన్స్ లో ఇవాళ భారీ భూకంపం వ‌చ్చింది. భూకంపం తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్ పై 6.5 గా న‌మోదైంద‌ని ప్రకంపనల కారణంగా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని స్థానిక అధికారులు హెచ్చరించారు. రాజధాని మనీలాకు 120 కిలో మీటర్ల దూరంలో, 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందన్నారు. మనీలాతో సహా దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించిన తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్టు స్థానిక అధికారులు తెలిపారు.

ప్రస్తుతం సంభవించిన భూకంప ప్రభావం చాలా అధికంగానే ఉందనీ.. ప్రకంపనల సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. భూకంపం నేపథ్యంలో ప్రాణనష్టం గురించి తక్షణ సమాచార నివేదికలు లేవు.. కానీ ప్రకంపనల ప్రభావాన్ని అంచనా వేయడానికి విపత్తు అధికారులను నియమించామని కలటగాన్ మున్సిపల్ అధికారి మెండోజా చెప్పారు. భూకంపం 30 సెకన్ల నుంచి నిమిషం వరకు కొనసాగిందని కలటగాన్ విపత్తు అధికారి రోనాల్డ్ టోర్రెస్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement