Saturday, May 18, 2024

కేబుల్ బ్రిడ్జిపై కారు.. అడ్డుకున్న స్థానికులు.. వైరల్ గా వీడియో

ఓ నదిపై ఉన్న ఇరుకైన సస్పెన్షన్ బ్రిడ్జి పర్యాటకులు కారును నడిపి వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. శివపురా హ్యాంగింగ్ బ్రిడ్జి అని పిలిచే ఈ వంతెన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని ఎల్లపురా పట్టణంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంలో ఉంది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు టూరిస్టులు బ్రిడ్జి మీదికి ఏకంగా కారును తీసుకొచ్చారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు. కారు బరువుకు వంతెన కూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వారిని వెంటనే వెనక్కి పంపించారు.

బ్రిడ్జిపై కారును తోసుకుంటూ వెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారు వెనుక చాలామంది టూరిస్టులు కనిపిస్తున్నారు. వాహనాన్ని తోసేటప్పుడు వంతెన ఊగుతూ ప్రమాదకరంగా కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.మోర్బీ బ్రిడ్జి కూలి వందలమంది జలసమాధి అయిన ఘటన జరిగి రెండు రోజులే అయ్యింది. ఇంకా సహాయకచర్యలు పూర్తిగా ఆగిపోలేదు. ప్రజలింకీ ఈ ఘటననుంచి తేరుకోలేదు. అంతలోనే కేబుల్ బ్రిడ్జికి సంబంధించిన మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement