Monday, April 29, 2024

భారత్ లో కొత్తగా 842 కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి.. తాజాగా ఇండియాలో గత 24 గంటల్లో 842 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,64,810కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,752 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,21,538 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఆరుగురు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,520కి చేరింది. ఇక మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.78 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement