Friday, April 26, 2024

4th Test : 480 పరుగులకు ఆసీస్ ఆలౌట్

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు కొన‌సాగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు 480 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు ఉస్మాన్ ఖవాజా 180 పరుగులు, కామెరున్ గ్రీన్ 114 పరుగులు, మర్ఫీ 41 పరుగులు, స్టీవ్ స్మిత్ 38 పరుగులు, నాథన్ లయాన్ 34 పరుగులు, ట్రావిస్ హెడ్ 32 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు, మహమ్మద్ షమీ రెండు వికెట్లు, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement