Thursday, March 28, 2024

మిస్ శెట్టి…

అనుష్క శెట్టి, నవీన పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతోంది. పి. మహేష్‌ కుమార్‌ దర్శకుడు. ఇటీవల -టైటిల్‌ లుక్‌ విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి అనుష్క శెట్టి కొత్త పోస్టర్‌ ను విడుదలైంది. ఈ పోస్టర్‌ లో విదేశీ లొకేష న్‌లో ఓ బిజీ రోడ్‌ తనదైన శైలిలో నవ్వుతూ రోడ్డు దాటు-తున్నట్టు-గా ఉంది అనుష్క. హ్యాండ్‌ బ్యాగ్‌, ఫుల్‌ డ్రెస్‌ లో తన లుక్‌ కూడా చాలా హాట్‌ గా ఉంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపు కుంటున్న ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ చిత్రాన్ని తెలుగుతో పాటు- తమిళ్‌, మళయాల, కన్న డ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో నవీన్‌ పోలిశెట్టి సిద్ధు అనే స్టాండప్‌ కమెడియన్‌ గా, అనుష్క అన్విత రవళిశెట్టి అనే చెఫ్‌ పాత్రలో నటిం చారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్‌, సినిమాటో గ్రఫీ: నీరవ్‌ షా, నిర్మాతలు: వంశీ – ప్రమోద్‌, రచన, దర్శకత్వం: పి. మహేష్‌ కుమార్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement