Wednesday, May 8, 2024

యూపీ ఎన్నిక‌ల మేనిఫెస్టో రిలీజ్ చేసిన ప్రియాంక‌గాంధీ .. మ‌హిళ‌ల‌కు వ‌రాల జ‌ల్లు ..

కాంగ్రెస్ పార్టీ మ‌హిళ‌ల‌కి ప్రాధాన్య‌త క‌ల్పిస్తుంద‌ని ప్రియాంక‌గాంధీ స్ప‌ష్టం చేశారు. కాగా యూపీ వుమెన్స్ మేనిఫెస్టో పేరుతో యూపీ ఎన్నిక‌ల కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆమె రిలీజ్ చేశారు.వ‌చ్చే ఏడాది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు ప్రియాంక‌గాంధీ ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేయ‌డం విశేషం. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధిస్తే.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం రిజ‌ర్వేష‌న్ కల్పిస్తామని చెప్పారు. అన్ని విధాల రాష్ట్ర అభివృద్ధికి ఈ మేనిఫెస్టో రోడ్ మ్యాప్ అని ఆమె తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ మహిళలకు 40 శాతం టిక్కెట్లు ఇస్తామ‌న్నారుతాము అధికారంలోని వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలోని 25 నగరాల్లో హాస్టళ్లను నిర్మిస్తుందని, బాలికల కోసం సాయంత్రం పాఠశాలలను తెరుస్తుందని చెప్పారు. గ్రాడ్యుయేట్‌ బాలికలకు స్కూటీలు, 12వ తరగతి పాసైన బాలికలకు స్మార్ట్‌ఫోన్లు అందజేస్తామన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని వెల్ల‌డించారు. దేశానికి తొలి మ‌హిళా ప్ర‌ధాన‌మంత్రిని కాంగ్రెస్ అందించింద‌ని గుర్తు చేశారు. దేశంలో తొలి మ‌హిళా సీఎంగా కాంగ్రెస్‌కు చెందిన సుచేత కృప‌లానీ అధికార ప‌గ్గాలు చేప‌ట్టార‌న్నారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే యూపీలో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలున్నాయి. దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement