Monday, November 11, 2024

FLASH: ప్రాణం తీసిన ఈత సరదా.. ముగ్గురు చిన్నారులు మృతి

జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి తుమేనాల గ్రామంలో ఆదివారం హృదయవిదారక సంఘటన జరిగింది. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చెరువులో ఇరుక్కొని మృతి చెందారు. గ్రామస్తుల కథనం మేరకు యశ్వంత్ (14), శరత్ (13), మణిదీప్ (13) ఉదయం ఈతకు కోసం గ్రామం ఆనుకొని ఉన్న ఊరు చెరువుకు వెళ్లారు. ఉదయం 11 గంటల సమయంలో ఓ బాలుడి శిరస్సు చెరువు నీటిపై భాగం తేలి ఉండడంతో అటుగా వెళ్తున్న పాదచారులు చూసి నీటిలో ఎవరిదో మృతదేహం ఉందని చెప్పడంతో గ్రామస్తులు చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ క్రమంలో తమ పిల్లలు కనిపించడం లేదంటూ మరో ఇద్దరు పిల్లల కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకొని విలపించారు. అనుమానంతో గ్రామస్తులు అదే నీటి మడుగు గాలించి మరో రెండు మృతదేహాలు వెలికితీశారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. సీఐ కోటేశ్వర్ ఎస్సై కిరణ్ సంఘటన స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం కోసం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement