Monday, April 29, 2024

26 శాతం పెరిగిన జీఎస్టీ వ‌సూళ్లు

జీఎస్టీ వ‌సూళ్లు సెప్టెంబ‌ర్‌లో 26 శాతం పెరిగాయ‌ని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దాదాపు 1.47 ల‌క్ష‌ల కోట్ల జీఎస్టీ వ‌సూల్ అయిన‌ట్లు తెలిపింది. గ‌డిచిన ఏడు నెల‌ల నుంచి జీఎస్టీ వ‌సూళ్లు వ‌రుస‌గా.. 1.40 ల‌క్ష‌ల కోట్లు దాటుతోంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో జీఎస్టీ మొత్తం వ‌సూళ్లు 1,47,686 కోట్లుగా ఉంద‌ని ఆర్థిక శాఖ తెలిపింది. దీంట్లో సెంట్ర‌ల్ జీఎస్టీ 25,271 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ 31,813 కోట్లుగా ఉంది. ఇక ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 80,464 కోట్లు కాగా, సెస్ 10,137 కోట్లుగా ఉందని కేంద్ర‌ ఆర్థిక‌శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement