Monday, May 6, 2024

కర్ణాటకలో 14 రోజుల లాక్ డౌన్..

కర్ణాటకలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. ఆదివారం ఒక్కరోజే కర్ణాటకలో 34,804 కరోనా పాజిటివ్ కేసులు, 143 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అప్రమత్తమయిన కర్ణాటక ప్రభుత్వం 14 రోజుల లాక్ డౌన్ విధించింది. ఒక్క బెంగళూరు నగరంలోనే నిన్న 20,733 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 10వరకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

10గంటల తర్వాత షాపులు మూసివేయబడి ఉంటాయని తెలిపింది. ఆల్కహ్కాల్ లేదా మద్యం హోం డెలివరీకి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పూర్తిగా మూసివేయబడుతుందని తెలిపింది. కేవలం నిర్మాణ,తయారీ,వ్యవసాయ రంగాలకు మాత్రమే తమ కార్యకలాపాలు కొనసాగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement