Sunday, May 19, 2024

ఔషధ సిరి.. తిప్పతీగ

కర్లపాలెం తిప్పతీగ.. ఇప్పుడు ఒక ఔషధ సిరిగా విస్తృత స్థాయిలో ప్రచారం లో ఉంది. నిన్న మొన్నటి వరకు ఇది ఎక్కడుందో తెలియదు. ఎలా ఉంటుందో కూడా చాలా మందికి తెలియదు. తాజాగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తిప్పతీగ వినియోగం మరింత పెరిగింది. బాపట్ల ప్రాంతంలోని అనేక సముద్రతీర గ్రామాల్లో తిప్పతీగ కోసం జనం ఎగబడుతున్నారు. చెట్లల్లో, పొదల్లో, రహదారుల వెంట దట్టంగా విస్తరించి ఉండే వివిధ రకాల చెట్ల మధ్యలో ఏపుగా పెరుగుతూ కనిపించే తిప్పతీగ కోసం జనం ఇప్పుడు ఎగబడుతున్నారు. నిన్నటి వరకు అసలు ఈ తిప్పతీగ అంటే ఏందో తెలియదు. దాని వల్ల ఉపయోగాలు అసలే తెలియదు. ఆయుర్వేద వైద్యంలో విరివిగా వినియోగించే ఈ తిప్పతీగ ఎన్నో రకాల వ్యాధులకు ఒక ఔషధ సిరిగా విరాజిల్లుతోంది. ఒక వారం రోజులపాటు తిప్పతీగ ఆకులను రోజుకు రెండు సార్లు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. తాజాగా కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ని కూడా అత్యధిక శాతం నివారించగల శక్తి ఈ తిప్పతీగ కు ఉండటంతో జనం ఆసక్తి మరింత పెరిగిపోతోంది. ఎంతటి తీవ్రమైన జ్వరం అయినా ఈ తిప్పతీగ ఆకుతో పూర్తిగా అదుపులోకి వస్తుందని చెబుతున్నారు. దీంతో బాపట్ల సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో అనేకమంది ఈ తిప్పతీగ కోసం అన్వేషణ ప్రారంభించారు. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు గానీ తిప్పతీగ లో మాత్రం ఖచ్చితమైన ఔషధ గుణాలు ఉన్నాయని జనం బలంగా నమ్ముతున్నారు. ఫలితంగానే రహదారుల్లో విస్తరించి ఉన్న దట్టమైన చెట్ల పొదల్లో తిప్పతీగ కోసం క్యూ కట్టారు. దట్టమైన చెట్ల మధ్య ఉండే ఈ తిప్పతీగ మొక్కలను సేకరించి అనేకమంది తమ ఇళ్లల్లో పెంచుకోవడంలో అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే దీని ప్రాముఖ్యత తెలిసిన బాపట్ల ప్రాంతంలోని అనేక ఆశ్రమాల్లో, గోశాలల్లో అనాదిగా తిప్పతీగ చెట్లను పెంచుకుంటూ వస్తున్నారు. దాని యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నారు. ఒకప్పుడు రోడ్డుకిరువైపులా రహదారుల్లో ఎక్కడపడితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా కనిపించే తిప్పతీగ చెట్లు క్రమేపీ అంతరించిపోతున్నాయి. అయితే దట్టమైన అడవుల్లో చెట్ల పొదల్లో మాత్రం విరివిగా తిప్పతీగ ఆకులు లభ్యమవుతున్నాయి. తాజా పరిస్థితుల్లో ప్రజలకు ఇవి మరింత ఉపయోగపడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement