Thursday, May 2, 2024

బిజెపి ఎమ్మెల్యేల ఏడాది స‌స్పెన్ష‌న్ ను ర‌ద్దు చేసిన ‘సుప్రీంకోర్టు’

అనుచితంగా ప్ర‌వ‌ర్తించార‌నే ఆరోప‌ణ‌ల‌తో 12మంది బిజెపి ఎమ్మెల్యేల‌ను ఏడాది పాటు స‌స్పెండ్ చేయాల‌ని మ‌హారాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని సుప్రీంకోర్టు నేడు కొట్టి వేసింది. సెషన్స్ దాటి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధమ‌ని కోర్టు పేర్కొంది. నిబంధనల ప్రకారం సస్పెన్షన్‌ సెషన్‌లో ఉండొచ్చని, 12 మంది ఎమ్మెల్యేలను సెషన్‌ దాటి ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు. స్పీకర్ ఛాంబర్‌లో ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్‌తో .. అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించడంతో వారిని గత ఏడాది జూలై 5న అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.12 మంది ఎమ్మెల్యేలు సంజయ్ కుటే, ఆశిష్ షెలార్, అభిమన్యు పవార్, గిరీష్ మహాజన్, అతుల్ భత్ఖల్కర్, పరాగ్ అలవానీ, హరీష్ పింపాలే, యోగేష్ సాగర్, జే కుమార్ రావత్, నారాయణ్ కుచే, రామ్ సత్పుటే , బంటీ భాంగ్డియా ఉన్నారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ తీర్మానాన్ని రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనిల్‌ పరబ్‌ ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement