Sunday, April 28, 2024

ఏపీలో 94 శాతం మందికి వ్యాక్సినేషన్.. నెలాఖరులోగా 100 శాతం పూర్తి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 93.94 శాతం మందికి కోవిడ్‌ రెండు డోస్‌ల వ్యాక్సినేషన్‌ పూర్తయింది. మిగిలిన వారికి కూడా ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కోవిడ్‌ మూడో దశలో లక్షణాల తీవ్రత, మరణాల శాతం చాలా తక్కువగా ఉంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కూడా తొలిడోసు నూటికి వంద శాతం పూర్తయింది. 18 ఏళ్ల పైబడిన వారికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు డోసులు నూటికి నూరు శాతం పూర్తికాగా.. ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికి పైగా పూర్తయింది. మూడు జిల్లాల్లో 80 శాతానికి పైగా పూర్తయింది.

ఇక, మొత్తం రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన 50.28 లక్షల మందికి మాత్రమే రెండు డోస్‌ల టీకా వేయాల్సి ఉంది. వీరికి కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement