Friday, May 3, 2024

Breaking: భారీ ర్యాలీతో అనంత‌పురం బ‌య‌ల్దేరిన ఎమ్మెల్యే బాల‌కృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి భారీ ర్యాలీతో అనంతపురం బయల్దేరారు. ఈరోజు అనంతపురంలోని జిల్లా కలెక్టర్ ను ఆయన కలవనున్నారు. ఆయనతో పాటు అఖిలపక్ష నేతలు కూడా కలెక్టర్ ను కలవనున్నారు. హిందూపురంను జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ బాలకృష్ణ కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. హిందూపురం నుంచి బాలకృష్ణ భారీగా ర్యాలీగా బయల్దేరార‌ని తెలుసుకున్న పోలీసులు అనంతపురంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండ‌గా… కలెక్టర్ కార్యాలయంలోకి ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న వారినే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బాలకృష్ణ వెంట పార్టీ నేతలతో పాటు అఖిలపక్ష నేతలు కూడా ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement