Saturday, April 20, 2024

థ్యాంక్యూ షూట్ పూర్తి – ఫొటో పోస్ట్ చేసిన డైరెక్ట‌ర్

హీరో నాగ‌చైత‌న్య‌, హీరోయిన్ రాశీఖ‌న్నా జంట‌గా రూపొందుతోన్న చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇటు ఇండియాలోనూ .. అటు ఫారిన్ లోను జరుగుతుంది. కరోనా ఎఫెక్ట్ వలన ఈ సినిమా షూటింగుకి కూడా అంతరాయం ఏర్పడింది. దాంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి అనుకున్న దానికంటే చాలా ఆలస్యమవుతుందనే టాక్ వినిపించింది. కానీ విక్రమ్ కుమార్ మాంఛి స్పీడ్ మీదే ఈ సినిమాను పూర్తిచేశాడు. ఈ సినిమా షూటింగు పూర్తయిందనే విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తమన్ సంగీతం .. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement