Sunday, April 28, 2024

100 శాతం పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటన

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ‘విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేరు లేదు. స్టీల్ ప్లాంట్‌లో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నాం. మెరుగైన ఉత్పాదకత కోసమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నాం. ప్రైవేటీకరణ ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెరుగుతుంది’ అని విశాఖ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు.

అటు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్రానికి సంబంధం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. స్టీల్‌ప్లాంట్ అమ్మకంపై జగన్ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని, అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. షేర్ల కొనుగోలుపై ప్రత్యేక ప్రతిపాదన పెట్టామని.. దీనివల్ల భాగస్వాములు, ఉద్యోగులు షేర్లు కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement