Saturday, May 4, 2024

తెలంగాణలో ‘ఆమె’కే పెద్ద‌పీట‌..

హైదరాబాద్‌, మహిళలే కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం గత ఆరున్నరేళ్ళలో అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. మహిళల అభ్యున్నతికి షీటీమ్స్‌, వి-హబ్‌, కేసీఆర్‌ కిట్‌ వంటి అనేక వినూత్న కార్యక్రమాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది. మహిళలు భరోసాతో ఉంటేనే కుటుంబం అభివృద్దిపథంలో సాగుతుందని భావించిన సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళల కోసం విప్లవాత్మకమైన అభివృద్ది పథకాలను ప్రవేశపెట్టారు. తెలంగాణ ఆడబిడ్డల అభివృద్దికి సీఎం కేసీఆర్‌ మానవీయ కోణంలో మ హత్తరమైన పథకాలు రూపకల్పన చేశారు. మహిళా సాధి కారతకై కేసీఆర్‌ సర్కారు విభిన్నమైన ఆలోచనలతో విప్లవాత్మక మైన పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తోంది. సోమవారం మహిళా దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మహిళాసంక్షేమానికి భద్రతకు అమలుచేస్తున్న పథకాలను, ఫలాలను వివరించింది.
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా..
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తల్లి బిడ్డల సంరక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా ‘కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంతో గర్భిణీలు, బాలింతలు, పుట్టిన బిడ్డలకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎంతో సంరక్షణ కలుగుతున్నది. దీంతో ప్రభుత్వ వైద్యశాలల్లో స హజ ప్రసవాలు పెరుగడంతో పాటు ఆడ శిశువులకు భద్రత వచ్చింది. గర్భిణీలకు గౌరవం దక్కేలా, ప్రసవాలన్నీ సర్కార్‌ దవాఖానాల్లో జరిపించి మాతా, శిశు సంర క్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు మంచి ఆదరణ వచ్చింది. మొదటిసారిగా వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పెన్షన్‌ అమలు చేస్తున్నారు.
8లక్షల మందికి హెల్త్‌ హైజీన్‌ కిట్లు
అంగన్వాడీల జీతాలను 150 శాతం పెంచడం జరిగింది. ఆశా వర్కర్ల జీతాలను రూ.6 వేలు పెంచింది. కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని 8 లక్షల మంది విద్యార్థినిలకు హల్త్ హైజీన్‌ కిట్ల’ను అందజేస్తున్నది. ‘స్త్రీ నిధి’ పేరుతో పది లక్షల వరకు వడ్డీలేని రుణాలను స్వయం సహాయక గ్రూపులకు మంజూరీ చేస్తున్నది. మహిళా సంఘాలకు బ్యాంకు లావాదేవీల్లో భాగంగా పారదర్శకత పాటించేందుకు వారికి ‘ట్యాబ్లెట్‌ పీసీ’లను పంపిణీ చేశారు. రవాణాలో మహిళల రక్షణకు, సౌలభ్యానికై ‘షి క్యాబ్స్‌’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కార్మిక శాఖ ఆధీనంలో ఉన్న పిల్లల పునరావాసానికై ‘ఆపరేషన్‌ స్మైల్‌ -ఆపరేషన్‌ ముస్కాన్‌’ పేరుతో కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.
సాధికారిత దిశగా..
తెలంగాణలోని అన్ని రంగాల మహిళలు, బాలికలను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యలు రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా ఉన్నాయి. సానియా, సింధు లాంటి అనేక మంది క్రీడాకారులకు ఎంతో స#హకారం, ప్రోత్సాహాలను అందించారు. గృహ హంసకు గురైన బాలిక ప్రత్యూషను దత్తత తీసుకొని అన్ని విధాల ఆదుకొని, పెండ్లి కూడా జరిపించి సీఎం కేసీఆర్‌ సరికొత్త మానవీయ కోణాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని మొతం 11,76,743 మంది వృద్ధులకు ప్రతినెలా రూ.2,016 చొప్పున ఆసరా పెన్షన్లు అందిస్తున్నది. వీరిలో సుమారు 60 శాతానికి పైగా వృద్ధ మహిళలున్నారు. వీరి కోసం ఏడాదికి ఏటా రూ. 1708 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. సమాజంలో ఏ తోడూలేని ఒంటరి మహిళలు సామాజి కంగా,ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ దయనీయంగా జీవితాలు గడుపుతున్నారు. అందుకే నిస్సహాయులైన ఒంటరి మహిళలకు ఆసరాగా నిలవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు భావించారు. సీఎం ఆదేశాల మేరకు దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో తొలిసారిగా 1,33,971 మంది ఒంటరి మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.2,016 చొప్పున ఏడాదికి రూ.348 కోట్లు పెన్షన్‌ అందజేస్తూ అండగా నిలుస్తున్నది. భర్త చనిపో యి ఏ తోడూ లేకుండా, ఆర్థిక సమస్యలతో పూటగడవ డమే కష్టంగా మారిన 14,26,686 నిస్సహాయ వితంతు వులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి, నెలకు రూ.2,016 చొప్పున ఏడాదికి రూ.3,696 కోట్లు పెన్షన్‌ అందిస్తున్నది. తెలంగాణలోని 4,21,223 మంది బీడీలు చుట్టే మహిళలు అనారోగ్య సమస్య ల బారిన పడుతున్నప్పటికీ, జీవనోపాధి కోసం ఈ పనినే కొనసాగిస్తున్నారు. దీంతో వీరిని ఆదుకోవాలని భావించిన సీఎం కేసీఆర్‌.. వీరికి నెలకు రూ.2,016 చొప్పున ఏడాదికి రూ.1019 కోట్లు పెన్షన్‌ ఇస్తున్నారు.
షీటీమ్స్‌ సక్సెస్‌
ఈవ్‌ టీజింగ్‌కు ముగింపు పలకాలనే ఉద్దేశంతో 2014 అక్టోబర్‌ 24న షీ టీములను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మ#హళలు, యువతు లు, విద్యార్థినులను రక్షించండం, వారి భద్రతకు ఈ బృందాలను ఏర్పాటుచేసింది. షీ టీమ్స్ మహిళల గౌరవాన్ని, హక్కులను కాపాడుతు న్నాయి. షీ టీమ్స్‌ సభ్యులైన పోలీసులు కాలేజీల్లోనూ, బస్టాండ్‌ల్లోనూ, రద్దీ ఉన్న ప్రదేశాలలో మప్టీnలో సంచరిస్తారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ప్రవేశపెట్టిన షీ టీం ప్రయోగం సక్సెస్‌ కావడంతో తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వం షీ టీంలను రంగంలోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో మొత్తం 200 షీ టీమ్స్‌ పనిచేస్తున్నాయి. వేలాది ఫిర్యాదులు అందగా కేసులు రిజిస్టర్‌ చేసి, జైలుకు పంపారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని చాలా రాష్ట్రాలు ‘షీ టీమ్స్‌’ ను ప్రవేశపెడుతున్నాయి. వేదింపులకు గురవుతున్న మహిళలు డయల్‌ 100కు ఫోన్‌ చేసి కానీ, ఈ మెయిల్‌, ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌, హాక్‌ ఐ మొబైల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదులు అందిస్తున్నారు. ఆ వెంటనే షీ టీమ్స్‌ స్పందిస్తున్నాయి. సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్‌ కమిటీల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్‌ కావాలని అసెంబ్లిdలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇలా విభిన్నరంగాల్లో తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, భద్రతకు, ఉన్నత అవకాశాల కల్పనకు చేస్తున్న కృషిని ఆవిష్కరిస్తోంది.
ఆడబిడ్డ పెళ్ళి సర్కారు బాధ్యతే
ఉమ్మడి రాష్ట్రంలో ఆడపిల్లల పెండ్లి కన్నవారికి భారంగా మారిన పరిస్థితులుండేవి. ఆడపిల్ల పుట్టగానే పెండ్లి గుర్తుకు వచ్చి తల్లిదండ్రులు బాధపడేవారు. అందుకే ఆడపిల్ల అని తేలగానే గర్భంలోనే చంపేయడమో, పుట్టిన తర్వాత ఎక్కడైనా వదిలేయడ మో, అమ్మేయడమో జరిగేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తల్లిదండ్రులను ఆ అవస్థల నుంచి గట్టెక్కించడానికి రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు కళ్యాణలక్ష్మి, మైనారిటీలకు షాదీ ముబారక్‌ పథకాలకు శ్రీకారం చుట్టింది. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలే ఈ పథకానికి అర్హులనే ప్రభుత్వ నిబంధన వల్ల బాల్య వివాహాలు చాలా తగ్గిపోయాయి. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా నవంబర్‌, 2020 నాటికి రాష్ట్ర ప్రభుత్వం 7,14,575 మంది లబ్దిదారులకు మొత్తం రూ.5,557 కోట్లు ఖర్చు చేసింది.
అమ్మ ఒడి.. ఆరోగ్యలక్ష్మి
పేదరికం పురుషుల కన్నా మహిళలను మరింత వేధిస్తుందని భావించిన సీఎం కేసీఆర్‌ నిస్సహాయులైన ఒంటరి మహిళలకు ఫించన్‌ అందించి, వారిని ఆదుకోవాలని, వారికి జీవన భద్రతను కల్పించాలని ఒంటరి మహిళలకు పెన్షన్‌ పథకాన్ని అమలు చేస్తున్నారు. నిండు గర్భిణీని ఆసుపత్రికి తీసుకొచ్చి, పురుడుపోసి, తల్లి బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చేందు కు ‘అమ్మ ఒడి పథకం’ను తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. దేశంలోనే మొదటిసారిగా ఈ అమ్మ ఒడి పథకాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆరోగ్యమే మహాభాగ్యమనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణకై ‘ఆరోగ్య లక్ష్మి పౌష్టికర ఆహార’ పథకాన్ని తీసుకువచ్ఛింది. గర్భిణీలు, బాలింతలు మూడేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందిం చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఏదైనా ప్రమా దం జరిగినపుడు వెంటనే ఫస్ట్‌ ఎయిడ్‌ సేవలను అందించేందుకు 108 బైక్‌ అంబులెన్స్‌ సర్వీసులను కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపె ట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో తక్షణ సేవలు అందజేయడానికి ‘రెక్కలు’ పేరుతో మహిళా ఎఎన్‌ఎం నర్సులకు స్కూటీలను అందజేశారు. ‘డోర్‌ టు డోర్‌ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌’ను ప్రారంభించారు. తెలంగాణ కంటి దీపాలైన ఆడబిడ్డలకు ‘దీపం పథకాన్ని’ విజయవంతంగా అమలు చేస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement