Thursday, May 2, 2024

చంద్రబాబు స్పందించారు.. జగన్ కూడా స్పందించాలి: గంటా

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు అన్ని పక్షాలు పోరాడాలని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కును కాపాడుకోలేకపోతే చరిత్ర హీనులుగా మారిపోతామని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం జరగలేదని రాష్ట్ర నేతలు తప్పుదోవ పట్టించారని గంటా ఆరోపించారు. ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాశారని, సీఎం జగన్ కూడా స్పందించిన ప్రధాన పాత్ర పోషించాలని కోరారు. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా రాష్ట్రంలోని బీజేపీ నేతలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్ కోసం రాష్ట్ర మంత్రులు రాజీనామా చేయాలన్నారు. మంత్రులు రాజీనామా చేసిన పక్షంలో టీడీపీ పోటీ పెట్టదని.. దీని కోసం సీఎం జగన్ కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement