Thursday, April 25, 2024

సెహ్వాగ్ సింహం, సచిన్ కొదమ సింహం

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఆసక్తికరంగా జరుగుతోంది. దిగ్గజ ఆటగాళ్లందరూ ఒకచోట చేరడం తో అందరి దృష్టి అటువైపు మళ్లింది. భారత ఆటగాళ్లు సచిన్ సెహ్వాగ్ యువరాజ్ కూడా ఈ సిరీస్ లో ఆడుతున్నారు. ప్రాక్టీస్ సెషన్‌లో సచిన్, సెహ్వాగ్ ల పై యువీ జోకులు వేస్తూ కూర్చున్నాడు. అయితే, స‌చిన్ గురించి సెహ్వాగ్‌తో యువీ మాట్లాడుతూ… సెహ్వాగ్ ఒక  సింహం అని, సచిన్ మాత్రం ఓ కొదమ సింహం అని వ్యాఖ్యానించాడు. సన్నద్ధత ఎలా ఉందని అనంతరం సచిన్ ను అడ‌గ‌గా ఇందుకు ఆయ‌న‌ స్పందిస్తూ.. నువ్వుండగా ఎవరికైనా ఆ అవకాశం ఉంటుందా? అని స‌ర‌దాగా ప్ర‌శ్నించాడు. ఈ రోజు ఇంగ్లండ్‌ లెజెండ్స్‌తో ఇండియా లెజెండ్స్ మ్యాచ్ ఆడ‌నుంది.

https://www.instagram.com/p/CMKLYA4Ab_j/?igshid=1ejoz5e0suwfi
Advertisement

తాజా వార్తలు

Advertisement