Friday, April 26, 2024

ఐదు సినిమాలు విభిన్నపాత్రలు

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ నేషనల్‌ స్టార్‌ గా పేరు తెచ్చుకున్నారు. బాహుబలి చిత్రం ఆయనను ఈస్థాయికి చేర్చింది. అలాగే ప్రాంతీ య సినిమాల ముఖచిత్రాన్నే మార్చేసింది. దక్షిణాదిలో అంతర్జాతీయ ఖ్యాతి చిత్రాలు నిర్మి స్తారని ప్రపంచానికి తెలియజెప్పింది. ప్రభాస్‌ స్టార్‌డమ్‌ ఆకాశమంత పెరిగింది. దాంతో ఆయన నటించే చిత్రాలన్నీ పాన్‌ ఇండియా సినిమాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.
అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్‌గానే కాకుండా, అత్యధిక బడ్జెట్‌తో నిర్మి స్తున్న చిత్రాల హీరోగా కూడా ప్రభాస్‌కు పేరుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్నవన్నీ పాన్‌ ఇండియా సినిమాలే.
ఆయనను డైరెక్ట్‌ చేయాలని చాలా మంది ఉత్సాహపడుతున్నారు. ప్రభాస్‌ పక్కన నటించాలని బాలీవుడ్‌ భామలు ముచ్చట పడుతున్నారు. ప్రభాస్‌తో సినిమా తీస్తే ప్రత్యేక గుర్తింపు వస్తుందని నిర్మాణ సంస్థలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్‌ ఐదు సినిమాల్లో నటిస్తు న్నారు. ఈ ఐదు కూడా విభిన్న జానర్‌ పాన్‌ ఇండియా సినిమాలు కావడం విశేషం. తాజా సమాచారం ప్రకారం 2025 వరకు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చేశారు.
ప్రేమకథతో సిద్ధమైన రాధేశ్యామ్‌:
ప్రభాస్‌ నటిస్తున్న రాధేశ్యామ్‌ వచ్చే ఏడా ది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇందులో లవర్‌బాయ్‌గా కనిపిస్తారు. ఇది ప్రేమ కథా చిత్రం. శనివారం ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ విడుదల చేస్తున్నారు.
యాక్షన్‌ సినిమా సలార్‌:
పూర్తి మాస్‌ పాత్రలో ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం సలార్‌. మైన్స్‌ నేపథ్యం ఉన్న కథ. కేజీఎఫ్‌తో పేరు తెచ్చుకున్న ప్రశాంత్‌ నీల్‌ దర్శ కుడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ చిత్రీకరణ పూర్తిచేశారు. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకి ఫుల్‌ కిక్‌ ఇచ్చే సినిమాగా సలార్‌ రెడీ అవుతుంది
శ్రీరాముడి పాత్రలో ఆదిపురుష్‌:
ఈతరం హీరోల్లో కొద్ది మందికి దక్కే అరు దైన అవకాశం ప్రభాస్‌కు దక్కింది. ఇప్పటికే బాహుబలి జానపదంలో నటించారు. ఇప్పుడు శ్రీరామునిగా పౌరాణికలో నటిస్తున్నారు. సిని మా పేరు ఆదిపురుష్‌. ఇది 3డీ చిత్రం. ఓం ప్రకాశ్‌ రౌత్‌ దర్శకుడు. టీ సిరీస్‌ నిర్మిస్తోంది.
సైన్స్‌ ఫిక్షన్‌ కే:
మహానటి సినిమాతో జాతీయ గుర్తింపు తెచ్చుకున్న నాగ అశ్విన్‌ ప్రాజెక్ట్‌ కే పేరుతో ఓ సైన్స్‌ ఫిక్షన్‌ తెరకెక్కిస్తున్నారు.
ప్రభాస్‌ కథానా యకుడు. ఇందులో అమితాబ్‌, దీపికా పదుకునే నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైంది.
వైవిధ్యమైన కథతో స్పిరిట్‌:
దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఓ డిఫరెంట్‌ స్టోరీని ప్రభాస్‌ కోసం రెడీ చేశారు. ఃస్పిరిట్‌ః అనే -టైటిల్‌ ని ఈ చిత్రానికి నిర్ణయించారు. ఇది ప్రభాస్‌ నటించే 25వ సినిమా. 8 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement