Friday, March 29, 2024

ప్రభుదేవా మిస్టర్‌ ప్రేమికుడు


ప్రభుదేవా, అదాశర్మ, నిక్కిగల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన ఃచార్లీ చాప్లిన్‌ః తెలుగులో మిస్టర్‌ ప్రేమికుడు పేరుతో అనువాదమవు తోంది.ఈ చిత్రాన్ని వి.శ్రీనివాసరావు, గుర్రం మహేష్‌ చౌదరి అనువదిం చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఃఃతమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చార్లిచాప్లిన్‌ చిత్రాన్ని తెలుగులో మిస్టర్‌ ప్రేమికుడు పేరుతో విడుదల చేస్తున్నాం. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టనర్‌ గా రూపొందిన ఈ చిత్రంలోని పాటలతో పాటు- ద్వితీయార్థంలో వచ్చే సన్నివేశాలు హైలెట్‌ గా నిలవనున్నాయి. ప్రభుదేవ పర్ఫార్మెన్స్‌, డాన్స్‌ తో పాటు- అదాశర్మ, నిక్కిగల్రాని అందం, అభినయం సినిమాకు ప్రత్యేక ఆకర్షణఃః అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement