Thursday, May 2, 2024

ఇకపై రాత్రి 9:30 తర్వాతే డ్రంక్ అంక్ డ్రైవ్

ఇటీవల మందు తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వాహన ప్రమాదాలను నిరోధించేందుకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు ముమ్మరం చేశారు. అందువల్ల సాయంత్రం నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు పోలీసులు దిగుతున్నారు. దీంతో తనిఖీలు చేస్తున్న అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ తీవ్రంగా నెలకొంటోంది. దీనిపై తమ ఇబ్బందులను తెలుపుతూ వాహనదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడం, పలు పత్రికల్లో ట్రాఫిక్ జామ్ గురించి వార్తలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు.

ఇకపై రాత్రి 9 గంటల్లోపు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు సరైన సమయం కాదని ట్రాఫిక్ పోలీసులు భావించారు. రాత్రి 7 గంటల తరువాత ఎక్కడెక్కడ తనిఖీలు జరిపారన్న విషయంపై ఆరా తీశారు. కొంతమంది ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహంతో ఈ పని చేసి ఉంటారని భావిస్తూ, రాత్రి 9.30 గంటల తరువాతనే పరీక్షలు చేయాలని గురువారం ఆదేశాలు జారీ చేశారు. మందుబాబులు కూడా 10 గంటల తరువాతనే రోడ్లపైకి వస్తారన్న అంచనాతోనే అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రాత్రి 9:30 గంటల తరువాతే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement