Friday, April 19, 2024

బాలిక పాడిన పాటకు చంద్రబాబు ఫిదా

తెలుగు భాష కమ్మగా ఉంటుంది. గొప్పగా కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు భాష గొప్ప‌ద‌నాన్ని చాటిచెప్తూ త‌ర‌గ‌తి గ‌దిలో 6వ త‌ర‌గ‌తి విద్యార్థిని పాడిన పాట‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫిదా అయిపోయారు. అదే స‌మ‌యంలో వైసీపీ స‌ర్కారుపై ఆయ‌న మండిప‌డ్డారు. తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ.. ఎంతో శ్రావ్యంగా గానం చేసిన ఈ 6వ తరగతి చిన్నారిని మనసారా అభినందిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

ఈ పాట సాహిత్యాన్ని వింటుంటే ప్రజలకు తెలుగు భాష మీద ఉన్న మమకారం స్పష్టమవుతోందని చెప్పారు. అలాంటి తెలుగును పాలకులు కనుమరుగు చేయాలనుకోవడం ప్రజల అభీష్టానికి వ్యతిరేకం, దారుణమ‌ని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా 6వ తరగతి విద్యార్థిని పాడిన పాట శ్రోతలను అలరిస్తోంది. మీరు కూడా ఈ అమ్మాయి పాట వినేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement