Sunday, April 28, 2024

ఐపిఎల్ – నాలుగో వికెట్ గా వార్న‌ర్ పెవిలియ‌న్ కు – 32/4

బెంగుళూరు- ఐపీఎల్ 16 వ సీజన్లో నేడు ఆర్ సి బి తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది.. ఈ మ్యాచ్ లో డిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. నిర్ధారిత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు న‌ష్ట‌పోయి 174 ప‌రుగులు చేసింది. దీంతో ఢిల్లీ గెల‌వాలంటే 175 ప‌రుగులు చేయాల్సివుంది. అయితే ఆరు ఓవ‌ర్లు ముగియ‌క‌ముందే నాలుగు వికెట్లు కోల్పొయి పీక‌లోతు క‌ష్టాల‌లో ప‌డింది.. నాలుగో వికెట్ రూపంలోవార్న‌ర్ 19 ప‌రుగులు చేసి వైశాక్ బౌలింగ్ లో పెవిలియ‌న్ కు చేరాడు..కాగా డిసికి తొలి ఓవ‌ర్ నాలుగో బంతికి పృథ్వీ ర‌నౌట్ అయ్యాడు.. రావ‌త్ వేసిన అద్భుత త్రోకి పృథ్వీ ప‌రుగులేమి చేయ‌కుండా వెనుతిరిగాడు.. ఆ త‌ర్వాత వ‌న్ డౌన్ వ‌చ్చిన మార్ష్ ను పార్నెల్ ఔట్ చేశాడు.. ఇక య‌ష్ దూల్ ని సిరాజ్ ఎల్ బిగా ఇంటికి పంపాడు .. తాజాగా వార్న‌ర్ కూడా ఔట‌య్యాడు.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ 6 ఓవ‌ర్లు ముగిసేనాటికి ఒక 4 వికెట్ల న‌ష్టానికి 32 ప‌రుగులు చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement