Tuesday, April 30, 2024

పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పై పవర్ ప్యాక్డ్ అప్డేట్..

యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ సినిమా “ఓజి”. ఈ సినిమా గురించి పవన్ ఫ్యాన్స్ ఓరేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సినిమా ఎలా ఉండ‌బోతుంది అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ రోజు ఈ మూవీ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ వ‌చ్చేసంది. ఇవ్వాల‌ సాయంత్రం 4 గంటల స‌మ‌యంలో ఫైర్ స్ట్రోమ్ లాంటి బ్లాస్టింగ్ అప్డేట్ ని మేకర్స్ ఇచ్చేసారు. మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమా స్క్రిప్ట్ ని సుజీత్ కంప్లీట్ చేస్తున్నట్టుగా పవర్ ప్యాక్డ్ వీడియోని లాంచ్ చేశారు మేకర్స్. ఇక థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీడియోని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసింది అనే చెప్పాలి. అలాగే పవన్ రోల్ పై చూపించిన చిన్న చిన్న డీటెయిల్స్ సినిమాలో యాక్షన్ గాని వైలెన్స్ గాని ఏ లెవెల్లో ఉంటాయో సుజీత్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement