Thursday, May 2, 2024

Vijayakanth : స‌న్ రైజ‌ర్స్ టీమ్ మ‌రో స్పిన్న‌ర్

సన్‌రైజర్స్ హైదరాబాద్ లోకి కొత్త ఆటగాడు వచ్చాడు. గాయం కారణంగా ఐపీఎల్‌ 17 సీజన్‌ మొత్తానికి దూరమైన వానిందు హసరంగ స్థానంలో శ్రీలంకకే చెందిన మరో లెగ్ స్పిన్నర్‌ విజయ్‌కాంత్ వియస్కాంత్ ను సన్‌రైజర్స్‌ తీసుకుంది.
ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల కోసం విజయ్‌కాంత్‌ను అతడి బేస్ ధర రూ.50 లక్షలకు హైదరాబాద్‌ జట్టులో చేర్చుకుంది.

- Advertisement -

ఈవిషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. 22 ఏళ్ల విజయ్‌కాంత్ ఇప్పటివరకు ఫ్రాంచైజీ క్రికెట్‌లో 33 టీ20లు ఆడి 42 వికెట్లు పడగొట్టాడు. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఎడమ మడమ నొప్పి కారణంగా వానిందు హసరంగ ఈ ఐపీఎల్‌ మొత్తానికి దూరమ‌య్యాడు అతడిని గత ఏడాది మినీ వేలంలో సన్‌రైజర్స్‌ రూ.1.5 కోట్లకు దక్కించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement