Thursday, May 2, 2024

మీడియా హక్కులను దక్కించుకున్న వైకోమ్‌.. రూ 951 కోట్లకు సొంతం

పురుషుల ఐపీఎల్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను దక్కించుకున్న వైకామ్‌ 18 ఉమెన్స్‌ ఐపీఎల్‌ మీడియా హక్కులను కూడా దక్కించుకుంది. త్వరలో జరగనున్న మహిళా ఐపీఎల్‌ మీడియా హక్కులను వైకోమ్‌కి దక్కాయి. వచ్చే ఐదేళ్ల కాలానికి ఈ సంస్థ మీడియా ప్రసార హక్కులను సొంతం చేసుకుందని బీసీసీఐ సెక్రటరీ జైషా సోమవారం సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేసి తెలిపాడు. ‘ మహిళల ఐపీఎల్‌ మీడియా హక్కులు గెలిచినందుకు వైకోమ్‌ సంస్థకు శుభాకాంక్షలు. బీసీసీఐపై మీకు ఉన్న విశ్వాసానికి ధన్యవాదాలు. మీడియా హక్కుల కోసం వైకోమ్‌ సంస్థ రూ 951 కోట్లు పెట్టడానికి సిద్దమైంది. అంటే ఒక మ్యాచ్‌కు రూ 7.09 కోట్లు చెల్లించనుంది.

పురుషుల జట్టుతో సమాన వేతనం తర్వాత మహిళల క్రికెట్‌కు మహర్దశకు ఇది అతి పెద్ద, కీలకమైన అడుగు’ అని జైషా ట్వీట్‌ చేశాడు. 2023-2027 వరకు మహిళల ఐపీఎల్‌ హక్కులను బీసీసీఐ, వైకోమ్‌ సంస్థకు కట్టబెట్టనుంది. బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న టోర్నీ ఉమెన్స్‌ ఐపీఎల్‌. అయితే ఈ లీగ్‌లో టీమ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోని ఫ్రాంచైజీలు బాగానే ఆసక్తి చూపించాయి. చెన్నయ్‌సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోని ఫ్రాంచైజీలు బాగానే ఆసక్తి చూపించాయి.

- Advertisement -

మార్చి ఐదు నుంచి 23 వరకు మహిళల ఐపీఎల్‌ తొలి సీజన్‌ జరగనుంది. మొత్తం ఐదు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. అయితే ఇప్పటివరకూ బీసీసీఐ షెడ్యూల్‌ విడుదల చేయలేదు. జనవరి 25వ తేదీన మహిళల ఐపీఎల్‌ ఫ్రాంచైజీలను ఆవిష్కరించనున్నట్టు సమాచారం. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న మహిళా క్రికెటర్లకు రూ 50 లక్షలు, రూ 40 లక్షలు , రూ 30 లక్షల బేస్‌ ప్రైజ్‌ , మిగతా వాళ్లకు రూ 20 లక్షలు, రూ 10 లక్షలు కనీస ధరను బీసీసీఐ ప్రకటించింది. అయిలే అ క్రమంలోనే ఉమెన్స్‌ ఐపీఎల్‌ మీడియా హక్కుల విక్రయం కోసం బిడ్డింగ్‌ నిర్వహించింది బీసీసీఐ. స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌ వర్క్‌తో పాటు సోనీ నెట్‌ వర్క్‌, అమేజాన్‌ వంటి బడా కంపెనీలన్నీ ఈ మీడియా హక్కులకు పోటీపడటంతో ఈ టోర్నీకి మంచి క్రేజ్‌ వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement