Sunday, April 28, 2024

IPL : మ‌ళ్లీ వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు..

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బద్ద శత్రువులైన ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ కలిసిపోయారు. గత ఐపీఎల్ సీజన్‌లో తమ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదానికి ముగింపు పలికారు.

ఒకరినొకరు అభినందించుకుంటూ హగ్ చేసుకున్నారు. ఈ మ్యాచ్‌ స్ట్రాటజిక్ టైమ్‌లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్ అభినందనలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పిక్ ఆఫ్ ది డే, పిక్ ఆఫ్ ది టోర్నీ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గంభీర్, కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
‘గొడవలు వద్దు.. స్నేహం ముద్దు’అని కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్.. ఆర్‌సీబీతో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో గొడవపడ్డాడు. తమ ప్లేయర్ నవీన్ ఉల్ హక్‌పై కోహ్లీ స్లెడ్జింగ్ దిగడాన్ని తప్పుబట్టిన గంభీర్.. మ్యాచ్ అనంతరం కోహ్లీతో గొడవపడ్డాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లోనే ఈ ఘటన అత్యంత వివాదాస్పదంగా నిలిచిపోయింది. అప్పటి నుంచి గంభీర్, విరాట్ కోహ్లీ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. తాజా మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా ఈ ఇద్దరూ మాట్లాడుకోలేదు. దాంతో మ్యాచ్ సందర్భంగా మళ్లీ గొడవ జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ గంభీర్.. ఓ అడుగు వెనుకేసి కోహ్లీతో స్నేహానికి తెరలేపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement