Friday, May 3, 2024

వృద్ధిమాన్ సాహా కీలక నిర్ణయం… రంజీలకు గుడ్ బై..

టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ వృద్ధిమాన్ సాహా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం అయ్యే ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. బెంగాల్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అతను ఈ సీజన్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాడు. టీమిండియాకు సాహా సేవలు అవసరం లేదని భారత్‌ క్రికెట్‌ నియంత్రణ మండలి భావిస్తున్న నేపథ్యంలో సాహా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మొహాలీ వేదికగా వచ్చే నెల్లో భారత్‌ జట్టు శ్రీలంకతో ఆడే రెండు టెస్టుల సిరీస్‌కు తనను పక్కనపెడ్తారనే విషయం సాహాకు తెలిసినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే.. టీమిండియాకు ఆడనప్పుడు.. రంజీ క్రికెట్‌ ఆడటం ఎందుకనే అభిప్రాయంలో సాహా ఉన్నట్టు తెలుస్తోందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే టీమిండియాలో రిషబ్‌ పంత్‌ పూర్తి స్థాయిలో కీపింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కివీస్‌తో జరిగిన కాన్పూర్‌ టెస్టులో కేఎస్‌ భరత్‌ సైతం మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. దీంతో పంత్‌కు బ్యాకప్‌ కీపర్‌గా భరత్‌ను ఉంచుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే సాహాను పక్కనపెట్టాలనే నిర్ణయం తీసుకుని ఉంటారని సదరు అధికారి తెలిపాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement