Wednesday, May 1, 2024

ఐపీఎల్‌ బరిలో.. గుజరాత్‌ టైటాన్స్‌

ఐపీఎల్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన అహ్మదాబాద్‌ తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. తమ జట్టుకు గుజరాత్‌ టైటాన్స్‌ అని పేరు పెట్టినట్టు వెల్లడించింది. సీవీసీ క్యాపిటల్స్‌ అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. శనివారం మెగా వేలం జరగబోతున్నది. దీంతో సీవీసీ క్యాపిటల్స్‌ యాజమాన్యం తమ జట్టుకు గుజరాత్‌ టైటాన్స్‌గా పేరుఉన ఖరారు చేసింది. ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేస్తున్న ఆ జట్టు గుజరాత్‌ క్రికెట్‌ వారసత్వాన్ని కొనసాగిస్తామని ప్రకటనలో తెలిపింది. గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ భారత్‌ క్రికెట్‌కు ఎంతో మంది లెజెండరీ ఆటగాళ్లను అందించనుందని గుర్తు చేసింది. ధైర్యవంతమైన, విశాల హృదయంతో కూడిన జట్టుగా ఉండాలని తాము భావిస్తున్నామని ఆ జట్టు సీఈఓ సిద్దార్థ పటేల్‌ పేర్కొన్నారు.

తమ జట్టు గొప్ప గొప్ప విజయాలను సాధించాలని ఆశించారు. తమ ఫ్రాంచైజీ ప్రధాన లక్ష్యం.. ప్రపంచంలో ఎక్కడైనా అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉండటమే అన్నారు. గుజరాత్‌ టైటాన్స్‌ వేలానికి ముందే ముగ్గురు ఆటగాళ్లను తమ రిటెన్షన్‌ జాబితాలో చేర్చుకుంది. టీమిండియా స్టార్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, ఆఫ్గనిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌కు రిటెన్షన్‌ జాబితాలో చోటు కల్పించింది. పాండ్యా, రషీద్‌కు రూ.15కోట్లు చొప్పున ఇవ్వనుంది. గిల్‌కు రూ.8కోట్లు చెల్లించనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement