Sunday, May 5, 2024

Cricket: నా పంథాలోనే వెళ్తా.. అప్పుడే సక్సెస్​ వస్తుందన్న సూర్యకుమార్‌ యాదవ్‌

నా పంథాలోనే ముందుకు వెళుతున్నాను. కానీ అది నిజంగా నాకు పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్నాయని టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. నేను ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే వార్మప్‌ చేసుకుని గ్రౌండ్‌లో అడుగు పెడతాను అని సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. ”నేను జాతీయ జట్టులోకి అడుగుపెట్టడం, ఈ స్థాయికి ఎదగడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రన్‌మెషీన్‌లా జట్టులో దూసుకువెళ్లడానికి అతి సాధారణ టెక్నిక్స్‌ అమలు పరుస్తున్నాను” అని సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పుకొచ్చారు.

ఇటీవలి కాలంలో సూర్యకుమార్‌ యాదవ్‌ మంచి ఫామ్‌లోకి వచ్చాడు. వరుసగా రెండుమార్లు ఐసిసి రెండో ర్యాంక్‌ తెచ్చుకున్నాడు సూర్యకుమార్‌. ”ఎంత క ష్టపడ్డా నేషనల్‌ టీంకు ఎంపిక కాలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యాను. 2017-18లో నేను నా భార్య దేవిషా కలిసి ఓ నిర్ణయం తీసుకొన్నాం. ఇక నుంచి హార్డ్‌ వర్క్‌ మానేసి, స్మార్ట్‌ వర్క్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. కొంచెం భిన్నంగా ప్రయత్నించాలని ఫిక్స్‌ అయ్యాం. దీంతో నా ట్రైనింగ్‌ డిఫరెంట్‌గా ప్రారంభించాను. 2018 తర్వాత నేను ఏం చేయాలో తెలిసొచ్చింది. డైటింగ్‌ మార్చాను. నా శరీరం పూర్తిగా మారిపోయింది. ప్రాక్టీసు ద్వారా పూర్తిగా మారిపోయాను ఆటలో నిలకడ వచ్చింది” అని సూర్యకుమార్‌ యాదవ్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement