Saturday, April 27, 2024

సూర్యాపేట లో రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు

సూర్యాపేట మరోమారు క్రీడలకు వేదిక కానుంది. ఈ నెల 25 నుండి 27వరకు సూర్యాపేట వేదికగా రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత నిస్తూ జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సాహం కల్పిస్తారని పేరు గడించిన రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి,స్థానిక శాససభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మూడు రోజుల పాటు జరుగు ఛాంపియన్ షిప్ పోటీలకు ఆతిథ్యం అందించనున్నారు.వసతి, బోజనాది సౌకర్యాలను సొంత ఖర్చులతో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

రాష్ట్రం నలుమూలల నుండి 40 జట్లు ఈ పోటీలలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అందుకు అనువైన మైదానం కోసం మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షలు,రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీదర్ రెడ్డి స్థానిక జూనియర్ కళాశాల మైదానం తో పాటు సూర్యాపేట శివారులోని లయోలా పాఠశాల మైదానాన్ని పరిశీలించారు.

బాల బాలికల తో సహ మొత్తం ప్రతినిధులు 600 మంది వరకు హాజరవుతారని వారికి ఎటవంటి ఇబ్బందులు కలుగ కుండా బోజనాల నుండి వసతి దాకా మంత్రి జగదీష్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద మరోమారు సూర్యాపేట ఆతిథ్యంగా ఆటల సందడి ఏర్పడ బోతుంది. మొదటి నుండి క్రీడా ప్రేమికుడు గా పేరొందిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయిన రోజునుండి గ్రామీణం నుండి మొదలు కొని జాతీయ స్థాయి వరకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించిన విషయం విదతమే. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని సకల సౌకర్యాలతో నిర్వహించిన విషయం తెలిసిందే. అందుకు కొనసాగింపుగా ఈ నెల 25 నుండి 27వరకు సూర్యాపేట కేంద్రంగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు మరోమారు క్రీడాబిమానులకు వినోదాన్ని పంచనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement