Tuesday, April 30, 2024

బంగ్లాపై చరిత్‌ అదుర్స్‌

5 వికెట్ల తేడాతో గెలిచిన లంకేయులు నయీమ్‌, ముష్ఫికర్‌ అర్ధశతకాలు వృథా
బంగ్లాదేశ్‌ 171/4.. శ్రీలంక 172/5 ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా అసలంక

షార్జా: టీ20 ప్రపంచకప్‌ 2021లో సూపర్‌సండే డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌ల్లో భాగంగా తొలి మ్యాచ్‌ బంగ్లాదేశ్‌-శ్రీలంక హోరాహోరీగా తలపడ్డాయి. సూపర్‌-12 మ్యాచ్‌లో బంగ్లాపులులుపై శ్రీలంక సింహాలు 5వికెట్లతేడాతో ఘనవిజయం సాధించాయి. 172పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.5 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి గెలుపొందింది. శ్రీలంక బ్యాటర్లు చరిత్‌ అసలంక 49బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లతో 80పరుగులు చేసి లంక విజయంలో కీలకపాత్ర పోషించాడు. అసలంకకు అండగా నిలిచినా భానుక రాజపక్స 31బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లతో 53పరుగులతో హాఫ్‌సెంచరీ చేసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. బంగ్లా బౌలర్లలు నాసుమ్‌ అహ్మద్‌, షకీబ్‌ అల్‌ హసన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్‌ దాసున్‌ శనక బౌలింగ్‌ ఎంచుకున్నాడు. లిటన్‌దాస్‌ 16బంతుల్లో 2ఫోర్లుతో 16పరుగులు, నయీమ్‌ 52బంతుల్లో 6ఫోర్లుతో 62పరుగులు చేసి మెరిశారు. తొలి వికెట్‌కు 40పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన ఈ జోడీని లహిరు కుమార విడదీశాడు. లిటన్‌దాస్‌ (16) శనకకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 40పరుగుల వద్ద తొలి వికెట్‌పడగా షకీబ్‌ (10)ను కరుణరత్నే పెవిలియన్‌కు పంపాడు. 56పరుగుల వద్ద రెండోవికెట్‌ పడింది. ఈదశలో నయీమ్‌, ముష్ఫికర్‌ ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. 37బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లతో 57పరుగులు చేసిన ముష్ఫికర్‌ అర్ధశతకం సాధించి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంమీద బంగ్లాదేశ్‌ నిర్ణీత 20ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 171పరుగులు చేసింది.
అసలంక, రాజపక్స అర్ధశతకాలు
బంగ్లా నిర్దేశించిన 172పరుగుల లక్ష్య ఛేదనలో లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే నసూమ్‌ బౌలింగ్‌లో కుశాల్‌ ఫెరీరా బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం నిశాంక (24) వెనుదిరిగాడు. ఈ దశలో బరిలోకి దిగిన చరిత్‌ అసలంక జట్టును ఆదుకున్నాడు. బౌండరీలతో స్కోరును పరుగెత్తించాడు. అసలంకకు తోడుగా రాజపక్స్‌ హాఫ్‌సెంచరీ చేయడంతో లంక సునాయాసంగా విజయాన్ని అందుకుంది. మొత్తంమీద శ్రీలంక 18.5ఓవర్లలో 5వికెట్లకు 172పరుగులు చేసి 5వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని కైవసం చేసుకుంది. అసలంక (80), శనక (1) నాటౌట్‌గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో షకీబ్‌ 2, అహ్మద్‌ 2, సైఫుద్దీన్‌ ఓ వికెట్‌ తీశారు. శ్రీలంక గెలుపులో కీలక పాత్ర పోషించిన అసలంక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

స్కోరుబోర్డు
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌
నయీమ్‌ (సి అండ్‌ బి) ఫెర్నాండో 62, లిటన్‌ దాస్‌ (సి) షనక (బి) లహిరు కుమార 16, షకీబ్‌ (బి) కరుణరత్నే 10, ముష్ఫికర్‌ రహీమ్‌ (నాటౌట్‌) 57, అఫిఫ్‌ (రనౌట్‌) 7, మహ్మదుల్లా (నాటౌట్‌) 10. ఎక్స్‌ట్రాలు 9. మొత్తం: 171 (4వికెట్లు. 20ఓవర్లు). వికెట్ల పతనం: 40-1, 56-2, 129-3, 150-4. బౌలింగ్‌: కరుణరత్నే 3-0-12-1, ఫెర్నాండో 3-0-27-1, చమీర 4-0-41-0, లహిరు కుమార 4-0-29-1, అసలంక 1-0-14-0, హసరంగ 3-0-29-0, షనక 2-0-14-0.
శ్రీలంక ఇన్నింగ్స్‌
కుశాల్‌ పెరీరా (బి) అహ్మద్‌ 1, నిశాంక (బి) షకీబ్‌ 24, చరిత్‌ అసలంక (నాటౌట్‌) 80, ఫెర్నాండో (బి) షకీబ్‌ 0, హసరంగ (బి) నయీమ్‌ (బి) సైఫుద్దీన్‌ 6, రాజపక్స (బి) అహ్మద్‌ 53, షనక (నాటౌట్‌) 1. ఎక్స్‌ట్రాలు 7. మొత్తం: 172 (5వికెట్లు. 18.5ఓవర్లు). వికెట్ల పతనం: 2-1, 71-2, 71-3, 79-4, 165-5. బౌలింగ్‌: అహ్మద్‌ 2.5-0-29-2, మెహిదీ హసన్‌ 4-0-30-0, సైఫుద్దీన్‌ 3-0-38-1, షకీబ్‌ 3-0-17-2, ముస్తాఫిజుర్‌ 3-0-22-0, మహ్మదుల్లా 2-0-21-0, అఫిఫ్‌ 1-0-15-0.

Advertisement

తాజా వార్తలు

Advertisement