Thursday, May 9, 2024

Breaking | పోరాడి ఓడిన శ్రీలంక.. 102 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం!

సౌతాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన వరల్డ్​ కప్​ నాలుగో మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన సౌతాఫ్రికా బ్యాటు జులిపించింది. ఈ వరల్డ్​ కప్​లో ఇప్పటిదాకా ఏ జట్టు చేయని 428 పరుగుల స్కోరుతో రికార్డుకొట్టింది. అందులో ముగ్గురు సెంచరీలు చేయడం గమనార్హం. ఇక.. 429 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక జట్టు ఆదిలోనే కీలక వికెట్లు పోగొట్టుకుంది. అయినా ఏమాత్రం తగ్గకుండా పోరాటం చేసింది. 43వ ఓవర్​లో 9వ వికెట్​ కోల్పోయింది.  

44వ ఓవర్​లో ఆఖరి వికెట్​ కోల్పోయింది. అప్పటిదాకా బ్యాటర్లు తమవంతు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈక్రమంలో  కుశాల్ మెండిస్​ (76), అసలంక (79), శనాకా (68), కాసున్​ రజిత (33) పరుగులతో రాణించారు. కాగా, నిస్సాంక (0), పెరేరా (7), సమరవిక్రమ (23), ధనుంజయ డిసిల్వా (11), వెల్లలగే (0) తుస్సుమనిపించారు. దీంతో 44 ఓవర్లలో శ్రీలంక 326 పరుగులు చేసింది. ఇక.. 102పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement