Monday, May 20, 2024

మైనార్టీలను మోసం చేసిందే కాంగ్రెస్, బీజేపీ ఎజెంట్ రేవంత్ రెడ్డి: మేడే రాజీవ్ సాగర్

తెలంగాణలోని మైనార్టీలకు బీఆర్ఎస్ పార్టీ చాలా చేసిందని.. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చర్చకు సిద్దమా…? అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగ‌ర్‌ సవాల్ విసిరారు. కావాలనే బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ పై అవాకులు చవాకులు పేలితే కర్రు కాల్చి వాత పెట్టాల్సి వస్తుందన్నారు. గత ప్రభుత్వాలు.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మైనార్టీలను చిన్న చూపు చూస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతే కేసీఆర్ గారి పాలనలో వీరి జీవితాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు.

క్ట్రిస్టియన్ సమాజం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ క్ట్రిస్టియన్ మైనార్టీ ఫైన్సాన్స్ కార్పోరేషన్ పేరుతో మైనార్టీలను ఆదుకుంటున్నారు. మైనార్టీలను ఆర్ధికంగా చేయూతను అందించడం కోసం 100శాతం సబ్సీడిపై రూ. లక్ష ఆర్ధిక సాయం అందిస్తున్నారని వివరించారు. అలాగే విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకునే మైనార్టీ విద్యార్ధులకు స్కాలర్ షిప్ లు అందజేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో క్రిస్టియన్లు నిర్లక్ష్యానికి గురవుతున్నారని వివరించారు. మిమ్మల్సి నమ్మి కర్నాటకలో మైనార్టీలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు బట్ట కాల్చి మీద వేయడం మానుకోవాలి.

క్రిస్మస్ సందర్భంగా గత పదేళ్లుగా ఎల్బీస్టేడియంలో వేల మందితో క్రిస్మస్ వేడుకలు నిర్వహించి ప్రేమ విందులో పాల్గొంటే 2009-14 వరకు క్రిస్మస్ సందర్భంగా కేవలం 40-50 మంది క్రిస్టియన్ మతపెద్దలతో తూతూ మంత్రంగా క్రిస్మస్ వేడుకలు జరిపింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. క్రిస్మస్ సందర్బంగా ప్రతి ఒక్క కుటుంబంసంతోషంగా ఉండాలని దాదాపు 2.85 లక్షల కుటుంబాలకు క్రిస్మస్ కానుకలు అందజేస్తున్నారని తెలిపారు.

గత ప్రభుత్వాలు 10 ఏళ్లకు కలిపి కేవలం 900 కోట్లు మాత్రమే మైనార్టీలకు నిధులు కేటాయిస్తే.. అదే పదేళ్లలో కేసీఆర్ గారు 12వేల కోట్ల రూపాయలు మైనార్టీలకు కేటాయించారని తెలిపారు. ఈ ఒక్క విషయంతో కేసీఆర్ మైనార్టీ పక్షపాతి అని స్పష్టమవుతుందన్నారు. మైనార్టీ విద్యార్థులు చదువుకునేందుకు 204 రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. అలాగే మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ లో శిక్షణ ఇచ్చి వారు స్వయం ఉపాధి పొందేందుకు ఉచితంగా కుట్టు యంత్రాలు అందజేసినట్లు తెలిపారు

నేడు తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ హక్కుల సమావేశం పేరుతో బీఆర్ఎస్ సర్కార్ పై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన క్ట్రిస్టియన్లను బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేయలేరని స్పష్టం చేశారు. పచ్చ కండ్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని గతంలో కాంగ్రెస్ పార్టీ క్ట్రిస్టియన్లు ఏం చేయలేదు కాబట్టే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదనుకోవడం కాంగ్రెస నేతల పొరపాటు అన్నారు.

ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన రేవంత్ రెడ్డి క్రిస్టియన్ల సంక్షేమం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించనట్లే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన వారిని పట్టుకుని బీజీపీ పంచన రేవంత్ రెడ్డి చేరడం ఖాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గల్లీలో తిట్టుకుంటూ ఢిల్లీలో చీకటి స్నేహం చేస్తున్నాయని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement