Monday, May 6, 2024

రెండో టీ20లో విండీస్ పై సౌతాఫ్రికా గెలుపు

 వెస్టిండిస్ తో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 16 పరుగుల తేడాతో గెలిచి 1-1తో సిరీస్‌ సమం చేసింది. మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్‌ (42; 5 ఫోర్లు, సిక్స్‌),  బవూమా (46; 5 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. విండీస్‌ బౌలర్లలో ఒబేద్‌ మెకాయ్‌ మూడు, కెవిన్‌ సింక్లెయిర్‌ రెండు వికెట్లు తీశారు. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 150 పరుగులు చేసి ఓడిపోయింది. ఆండ్రీ ఫ్లెచర్‌ (35; 2 ఫోర్లు, సిక్స్‌), ఫాబియన్‌ అలెన్‌ (12 బంతుల్లో 34; 5 సిక్స్‌లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జార్జి లిండె (2/19), రబడ (3/37) రాణించారు.  మూడో టి20 మ్యాచ్‌ నేడు జరుగుతుంది. 

ఇది కూడా చదవండి: http://గ్రౌండ్ లో రోనాల్డో భావోద్వేగం..

Advertisement

తాజా వార్తలు

Advertisement