Monday, April 29, 2024

చార్‌ధామ్ యాత్ర వాయిదా

ప్రతిష్ఠాత్మక చార్‌ధామ్ యాత్రను వాయిదా వేస్తున్న‌ట్లు ఉత్త‌రాఖండ్ ప్రభుత్వం ప్ర‌కటించింది. త‌దుప‌రి ఆదేశాలు జారీచేసే యాత్ర వాయిదా కొన‌సాగుతుంద‌ని పేర్కొంది. ఉత్త‌రాఖండ్ హైకోర్టు ఆదేశాల మేర‌కు తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. యాత్ర వాయిదా నేప‌థ్యంలో కొవిడ్ సంబంధ మార్గ‌ద‌ర్శ‌కాల్లో ప్ర‌భుత్వం మ‌రోసారి మార్పులు చేసింది.

అంత‌కుముందు ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల ప్రజల కోసం చార్‌ధామ్ యాత్రను పాక్షికంగా ప్రారంభించ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. జూలై 1 నుంచి యాత్ర మొద‌టి ద‌శ‌ను, జూలై 11 నుంచి యాత్ర రెండో ద‌శ‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉత్త‌రాఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖ‌లైంది.

ఇది కూడా చదవండి: ఒక్క బైకుపై 130 చలాన్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement