Saturday, May 4, 2024

మహిళల టీ 20 వరల్డ్ కప్ – ఇంగ్లాండ్ కు షాక్ – ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా

మహిళల టీ 20 వరల్డ్ కప్ లో అతిద్య జట్టు దక్షిణాఫ్రికా సెమీస్ లో ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ కు దక్షిణాఫ్రికా దూసుకు వెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ 20 ఓవర్ల లో 8 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసి ఓటమి పాలైంది. దీంతో దక్షిణాఫ్రికా ఫైనల్స్ చేరింది . ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా ఆసీస్ తో తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement