Thursday, April 25, 2024

Follow up | కొండగట్టు అంజన్న ఆలయంలో దొంగల హల్‌చల్‌.. ఆలయ చరిత్రలో మొదటిసారి కొండగట్టులో దొంగతనం

మల్యాల, ప్రభన్యూస్‌: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ముగ్గురు దొంగలు ఆలయంలోకి చొరబడి 15 కిలోల విలువైన వెండి వస్తువులను దొంగలించారు. వందల ఏళ్లకుపైగా చరిత్ర కల్గిన ఆలయంలో దొంగలు చోరబడటం ఆలయ చరిత్రలో మొదటిసారి.

దొంగతనం జరిగింది ఇలా….

అర్థరాత్రి 1.30 నిమిషాల ప్రాంతంలో ఆలయం వెనుక గేటు తాళాలు పగులగోట్టి కషాయం కండువాలు, మాస్కులు ధరించిన ముగ్గురు దొంగలు ఆలయంలోకి చోరబడ్డారు.అనంతరం ఆలయంలోని చేరుకొని అంతరాయంలోకి వెళ్లే దారికి అడ్డుగా ఉన్న తలుపుల పట్టీలను తోలగించి ఆలయంలోకి ప్రవేశించారు. గర్భాలయ తలుపుల పట్టీలను పగులగొట్టి ఆలయంలోకి చోరబడి గర్భాలయంలోని స్వామివారి కీరిటం, మకరతోరణం, శ్రీరామరక్ష, గోడుగులు, మకరతోరణ స్తంభం, శఠగోపాలు,హనుమాన్‌ కవచం, వెండి తోరణాలు, శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలోని రెండు శఠగోపాలను ఎత్తుకెళ్లారు.

- Advertisement -

ఆలయంలోని 15 కిలోల వెండి వస్తువులు దొంగలించబడ్డాయని ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బేతాళస్వామి ఆలయపరిసరాల్లో డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేయగా శునకాలు నిత్యం స్వామివారికి వినియోగించే సాగర్‌గెస్ట్‌ హౌజ్‌ సమీపంలో హనుమాన్‌ కవచానికి సంబంధించిన ఫ్రేమ్‌ దొరికింది. దానిపై ఉన్న ఫింగర్‌ప్రింట్స్‌ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. క్లూస్‌ టీం, సైబర్‌క్రైమ్‌ టీంలు కొండపై తనిఖీలు చేపట్టాయి.

కొన్ని వస్తువులను ముట్టుకోని దొంగలు..

దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తులు ఆలయంలోని పలు వస్తువులను ముట్టుకోలేదు. ఆలయంలోని హనుమాన్‌ విగ్రహంపై ఉన్న శంకంచక్రం, బంగారు శ్రీరామరక్ష తోరణం, పాదుకలు, ఉత్సవమూర్తి విగ్రహం, అంతరాయంలోని తోరణం, శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయంలోని వెండి తోరణం, పాదుకలు,శ్రీ వెంకటేశ్వర ఆలయంలోని శ్రీరామపట్టాభిషేకం వస్తువులను మాత్రం ముట్టలేదు.

అధికారుల నిర్లక్ష్యం..

ఆలయంలపై పటిష్టమైన భద్రత లేకపోవడం, ఒక్క అధికారి సైతం రాత్రి సమయాల్లో ఆలయం దగ్గర ఉండకపోవడం, సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరించడం, ఎవరు ఏం విధులు నిర్వహిస్తున్నారనేది తెలియడం లేదు. గర్భాలయంలోకి నిత్యం ఉండే భక్తులు రావడం వారితోనే అధికారులు, అర్చకులు పనులు చేయించడం జరుగుతుంది. ఆలయ అధికారులు, సిబ్బంది చేయాల్సిన పనులు సెక్యూరిటీ గార్డులు, ఇతర వ్యక్తులు చేస్తున్నారు. ఆలయ ఈవో, సూపరిండెంట్‌ పర్యవేక్షణ లోపంతో ఎవరి ఇష్టారాజ్యం వారిదే అన్నట్లుగా మారింది. మొత్తంగా పూర్తిస్థాయి సిబ్బంది, అధికారులు లేకపోవడంతో నిర్లక్ష్యానికి కారణమవుతుంది.

ఆలయ సెక్యూరిటీ ఇలా……

ఆలయంలో నిత్యం 12 మంది హోంగార్డుల్లో ఉదయం 6గురు, సాయంత్రం 6 గురితో పాటు సెక్యూరిటీగార్డు విధులు నిర్వర్తిస్తున్నారు. రాత్రివేళ్లలో నలుగురు హోంగార్డులు విధుల్లో ఉంటారు. ఇలా నిత్యం ఉన్నట్లుగానే రాత్రి వరకు నిధులు నిర్వర్తించిన అర్థరాత్రి సమయంలో హోంగార్డు గదికి చేరుకున్న అనంతరం దొంగలు ఆలయంలోకి చోరబడినట్లు తెలుస్తోంది. ఉదయాన్నే ఆలయాన్ని శుభ్రపర్చడానికి వెళ్లిన స్వీపర్లు గర్భాలయంలోకి వెళ్లగా అందులో కోతులు ఉండటం, సామాగ్రి చెల్లచెదురుగా పడడం గమనించిన వారు వెంటనే ఉపప్రధాన అర్చకులు చిరంజీవిస్వామి దృష్టికి తీసుకెళ్లగా, ఆలయ ఈవో ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు.

చోరీ వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే రవిశంకర్‌

ఆలయంలో దొంగతనం జరగడం దురదృష్టకరమని, అందరి కోరికలు తీర్చే అంజన్న ఆలయంలో ఇలా జరగడం బాధకరమని చోప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు.ఆలయంలోకి భక్తుల రూపంలో దొంగలు చోరబడి, విలువైన వెండి ఆభరణాలను అపహరించారని, అతిత్వరలోనే దొంగలను పట్టుకుంటారని, జిల్లావ్యాప్తంగా 10 ప్రత్యేక బృందాలు దోంగల కోసం గాలిస్తున్నాయని, నలుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలతో బృందాలను ఏర్పాటు చేసి చెక్‌పోస్టుల వద్ద గాలింపు చర్యలు చేపడుతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement