Sunday, May 5, 2024

ద్రవిడ్‌ ఓ అద్భుతం: సల్మాన్ బట్

టీమిండియా మాజీ క్రికెటర్, ఇండియా ఏ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మన్ సల్మాన్ బట్ ప్రశంసలు కురిపించాడు. ద్రవిడ్ అమోఘమైన ప్రతిభగల ఆటగాడని, యువ ఆటగాళ్లకు ఏం నేర్పించాలి, ఎలా నేర్పించాలి అనే విషయంలో అతడిని అపార అనుభవం ఉందని చెప్పుకొచ్చాడు. ‘భారత్.. తమ ఆటగాళ్లకు శిక్షణనిచ్చేందుకు స్పెషలిస్టులను ఎంపిక చేస్తోంది. ప్రతిభగల నిపుణులైతే వారిని పరిగణలోకి తీసుకుంటోంది. ఇక ద్రవిడ్‌ ఎలాంటి ప్రతిభావంతమైన శిక్షకుడో వేరే చెప్పక్కర్లేదు. దానికి తోడు ద్రవిడ్ టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్‌లో దిట్ట. అందుకే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అతడేంటో అనేకసార్లు నిరూపించుకున్నాడు’ అంటూ ద్రవిడ్‌పై బట్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఇది కూడా చదవండి: T20 ఫార్మాట్ లో తొలి డబుల్ సెంచరీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement