Sunday, May 5, 2024

Breaking: దంచికొడుతున్న రుతురాజ్.. 10 ఓవ‌ర్ల‌లో ఇండియా స్కోరు ఎంతంటే..

విశాఖ స్టేడియం వేదిక‌గా ఇవ్వాల ద‌క్షిణాఫ్రిక‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఇండియ‌న్ ఓపెన‌ర్స్ రుతురాజ్ గైక్వాడ్‌, ఇషాన్ కిషాన్ చెల‌రేగి ఆడుతున్నారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా టీమ్‌లో బ్యాట్స్‌మ‌న్ రుతురాజ్ చిచ్చ‌ర‌పిడుగులా రెచ్చిపోతున్నాడు. 34 బంతులో 57 పరుగులు చేసి మాంచి జోష్ మీదున్నాడు.

ఇక‌.. అత‌నికి స‌పోర్ట్‌గా ఇషాన్ కిష‌న్ కూడా జ‌త కావ‌డంతో ఇద్ద‌రు క‌లిసి స్కోరు బోర్డును ప‌రుగులెత్తిస్తున్నారు. అయితే ప‌దో ఓవ‌ర్ చివ‌రి బంతికి బౌల‌ర్‌కు చిక్కాడు రుతురాజ్‌. దీంతో 10 ఓవ‌ర్ల‌లో ఇండియా స్కోరు 97/1 గా ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement