Wednesday, May 22, 2024

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో.. స్వాతిముత్యం సినిమాతో తెరంగేట్రం!

నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు గణేష్ స్వాతిముత్యం అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో తొలిసారి వెండితెర‌కు ప‌రిచ‌యంకాబోతున్నాడు. లక్ష్మణ్ కె.కృష్ణ రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. డీజే టిల్లు మూవీని నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. కాగా, స్వాతిముత్యం షూటింగ్ పూర్తికావ‌డంతో.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిశోర్, హర్షవర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కాగా, లెటెస్ట్‌గా ఈ సినిమాని ఆగస్టు 13న విడుదల చేయ‌నున్న‌ట్టు ప్రకటించారు నిర్మాతలు. దీనికి సంబంధించి ఓ పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ స్కూటీ మీద తిరుగుతూ సరదాగా గడుపుతున్నారు. ప్రేమ, పెళ్లి, ఆధునిక సంబంధాల వంటి అంశాలతో ఈ చిత్రం ఉంటుందని సమాచారం.

స్వాతి ముత్యం చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా, పీడీవీ ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర కథానాయిక వర్ష బొల్లమ్మ చివరిగా తెలుగులో రాజ్ తరుణ్‌తో కలిసి స్టాండ్ అప్ రాహుల్‌లో నటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement