Tuesday, April 30, 2024

పీవీ సింధు మోకాలికి గాయం … రెండు నెలల పాటు ఆటకు దూరం

ఒలింపిక్ ప‌త‌కాలు విజేత , బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు గాయ‌ప‌డింది. ఆమె ఎడ‌మ మోకాలుకు స్వ‌ల్పంగా క్రాక్ వ‌చ్చిన‌ట్లు గుర్తించారు. స్కాన్ తీసిన త‌ర్వాత డాక్ట‌ర్లు ఆమెకు రెస్టు సూచించారుగ‌త వారం రెన్నిస్‌లో జ‌రిగిన ఫ్రెంచ్ సూప‌ర్ ఓపెన్ రెండో రౌండ్‌లో సింధు గాయంతో త‌ప్పుకున్న‌ది.

థాయిలాండ్‌కు చెందిన సుప‌నిదా క‌టేతాంగ్‌తో మ్యాచ్ ఆడుతున్న స‌మ‌యంలో ఆమె గాయానికి లోనైంది. మ‌ళ్లీ ట్రైనింగ్ మొద‌లుపెట్ట‌డానికి ముందు కొన్ని వారాలు రెస్టు తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచించిన‌ట్లు సింధు తెలిపింది. బ్రేక్ తీసుకోవ‌డం వ‌ల్ల రాబోయే ఒలింపిక్స్ క్రీడ‌ల‌పై ఫోక‌స్ పెట్ట‌వ‌చ్చు అని ఆమె తెలిపారు. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ కోర్టులో అడుగుపెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement