Friday, May 17, 2024

4 దేశాల టీ20 సిరీస్‌ కు పీసీబీ ప్రతిపాదన‌.. వద్దంటున్న బీసీసీఐ..

న్యూఢిల్లి: భారత్‌, పాకిస్థాన్‌తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను కలిపి నాలుగు దేశాల టీ20 సిరీస్‌ను నిర్వహించాలన్న పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రతిపాదించింది. పీసీబీ చీఫ్‌ రమీజ్‌ రాజా ఈ టోర్నీని ఇటీవల ప్రతిపాదించాడు. దీనిపై స్పందించిన బీసీసీఐ పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ టోర్నీ వల్ల వాణిజ్య ప్రయోజనాలు తప్ప ప్రపంచ క్రికెట్‌కు ఏ విధంగా ఉపయోగం లేదని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపాడు.

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఈవెంట్లు, ఆయా దేశాల మధ్య దైపాక్షిక సిరీస్‌లకు ప్రాధాన్యమిస్తూనే ఐపీఎల్‌ కూడా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఒలింపిక్స్‌లోనూ పొట్టి క్రికెట్‌ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ సల్పకాలిక ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని జైషా తెలిపాడు. కాగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్‌ 23న దాయాదులు భారత్‌-పాక్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఐసీసీ సోమవారం విక్రయించగా గంటల వ్యవధిలోనే మొత్తం టికెట్లు అమ్ముడైపోవడం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement